కడప జిల్లా టిడిపి అధికార ప్రతినిధి పి.మునిశేఖర్ రెడ్డి చాపాడు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం చేసిన అరాచకాలు అసమర్థత పాలన పై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న విధానాలపై,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేత పత్రాలు విడుదల చేస్తుంటే వైసీపీ ప్రభుత్వం ఉండే పేటీఎం బ్యాచ్కు సాక్షి యాజమాన్యానికి వణుకు పుడుతున్నది. గత ప్రభుత్వంలో ఎప్పుడైనా వైసిపి వాళ్ళు శ్వేతా పత్రాలు విడుదల చేసి ప్రభుత్వంలో ఉండే ప్రస్తుత పరిస్థితుల గురించి ప్రజలకు తెలియజేసినారా. మీ చేతకాని పరిపాలన వలన 5 సంవత్సరాలపాటు రాష్ట్రాన్ని చెత్తగా మార్చేశారు. 35 రోజులలోనే ఆ చెత్త మొత్తం క్లీన్ అవుతుందా. ఎప్పుడైనా జగన్ ఢిల్లీ వెళ్ళినప్పుడు రాష్ట్ర అభివృద్ధి గురించి పని చేశాడా. అసలు రాష్ట్రంలో ఎన్ని శాఖలు ఉన్నాయో తెలిసి పరిపాలన చేశాడా. నీవు అభివృద్ధి చేయాలి అని ఉంటే పూర్తి కేంద్ర ప్రభుత్వమే నిధులు కేటాయించే పోలవరం ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేయలేకపోయావు. అలాగే మా ప్రభుత్వం వచ్చినా 35 రోజులలోనే మచిలీపట్నానికి 75 వేల కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్ట్ తీసుకొచ్చిన ఘనత మా సీఎంకు అభివృద్ధిపై ఉన్నది అనేదానికి నిదర్శనం. అలాగే రాష్ట్రంలో రాబోయే రోజులలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసి భారీ పరిశ్రమలు రాబోతున్నాయి.ఇకనైనా సాక్షి పత్రికలో తప్పుడు వార్తలు మానుకోకపోతే ఇప్పుడు ఇచ్చిన 11 సీట్ల కన్నా రాబోయే ఎలక్షన్లో ప్రజలు ఒక సీటు కూడా ఇవ్వరు. ఇకనైనా గమనించి ప్రభుత్వానికి సలహాలు ఇచ్చి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయవలసినదిగా కోరుతున్నాము.

previous post
next post