విశాఖపట్నం కాశీ పుణ్యక్షేత్రానికి శ్రీ స్వామి వివేకానంద సంస్థ వారు, సంస్థ సభ్యులు కాశీ విశ్వేశ్వరుని, కాశి అన్నపూర్ణ దేవి, కాశీ విశాలాక్షిని, త్రివేణి సంగమం దర్శించుకున్నారు. అనంతరం కాశీలో ఉన్న స్వాములకు వృద్ధులకు, వస్త్ర దానం చేశారు. వివేకానంద సంస్థ వారు ఎప్పుడు కాశీకి వెళ్లిన, అన్నదానం, వస్త్ర దానం నిర్వహిస్తూ ఉంటారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు అప్పారావు మాట్లాడుతూ, ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా కాశీ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్న ప్రతిసారి అన్నదానం, వస్త్ర దానం చేస్తుంటామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు యూ . ఎల్లాజీ, శ్రీరామ్, మరియు డి . ఎల్లాజీ,టీ . కృష్ణ, కోదండ మొదలైన వారు పాల్గొన్నారు.
