Tv424x7
Andhrapradesh

ఢిల్లీకి వెళ్తావా జగన్!. పద నేనూ వస్తా….!

వినుకొండలో రషీద్ అనే యువకుడు దారుణ హత్యకు గురైన నేపథ్యంలో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని నిరసన తెలిపేందుకు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వచ్చే బుధవారం ఢిల్లీలో ధర్నా చేస్తానని వెల్లడించారు. ఈ నేపథ్యంలో హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు.“” ఢిల్లీకి వెళ్తావా జగన్.. పద నేనూ వస్తా. నీతో పాటు ధర్నాలో కూర్చుని నువ్వు ఐదేళ్ల పాటు చేసిన అరాచకాలన్నీ నేను బయటపెడతా. నీకు మా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఏ తప్పూ కనిపించకపోవడంతో వినుకొండ ఘటనను రాజకీయం చేయాలని చూస్తున్నావ్. మరి నువ్వు ఏకంగా బాబాయ్‌నే చంపినోడివి కదా. దాని గురించి ఐదేళ్లు ఎందుకు మాట్లాడలేదు. నీ ఇంటి చెల్లెళ్లు రోడ్డు మీదకు వచ్చి బోరున విలపిస్తే ఎందుకు పట్టించుకోలేదు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున ఎక్కడ అసెంబ్లీకి రావాల్సి వస్తుందో అని భయపడి ఢిల్లీ వెళ్తానంటున్నావ్. ఒకపని చేయ్.. నీ ఎమ్మెల్యేలను తీసుకుని ముందు అసెంబ్లీకి రా. అసెంబ్లీ సమావేశం అయిపోయాక ఢిల్లీకి వెళ్లు. నిన్ను ఎవ్వడూ ఆపడు “” అని మండిపడ్డారు హోమ్ మినిష్టర్ అనిత

Related posts

అడ్డంగామీడియాలోఅడ్డంగా బుక్కైన లలితా జువెల్లరీ అధినేత..!

TV4-24X7 News

నాలుగు పార్టీలు……..- రెండు కుటుంబాలు….

TV4-24X7 News

పేద కుటుంబానికి సహాయం చేసిన ప్రెండ్స్ సేవ సంస్థ

TV4-24X7 News

Leave a Comment