Tv424x7
Andhrapradesh

బైక్ వెనుక కూర్చున్న వారికీ హెల్మెట్ ఉండాలిట్రాఫిక్ ఏడీసీపీ శ్రీనివాసరావు

విశాఖపట్నం ద్విచక్ర వాహనదారుడితో సహా వెనుక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ తప్పకుండా ధరించాలని ట్రాఫిక్ ఏడీసీపీ శ్రీనివాసరావు తెలిపారు. పోలీసు కమిష నరేట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో రోజూ చోటుచేసుకుంటున్న ద్విచక్ర వాహనాల ప్రమాదాల్లో ఒకరిద్దరు మృతి చెందుతుండగా, పలువురు గాయాలపాలవుతున్నారన్నారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించటం ప్రాణాంతకమని హెచ్చ రించారు. ఇటీవల హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ద్విచక్ర వాహన దారులు తప్పకుండా హెల్మెట్ ధరించాల్సిందేనన్నారు. ఈమేరకు అవగా హన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. నగరంలో సుమారు 44 ప్రధా న కూడల్లో ప్రచారం చేస్తామన్నారు. బీఐఎస్ మార్కు ఉన్న హెల్మెట్నే ధరించాలన్నారు.. వాహనంపై ప్రయాణస్తున్న ఇద్దరిలో ఏ ఒక్కరికి హెల్మెట్ లేకున్నా రూ. 1035 చలానా వసూలు చేస్తామన్నారు. హెల్మెపోస్టర్లు అవిష్కరిస్తున్న పోలీసులు అధికారులు ట్ లేకుండా వాహనం నడిపి ప్రమాదానికి కారణమైతే, సంబంధిత వ్యక్తి డ్రైవింగ్ లైసెన్సు మూడు నెలలు పాటు సస్పెండ్ చేయనున్నట్టు చెప్పారు. మైనర్లకు వాహనం ఇస్తే.. తల్లిదండ్రులకు, లేదా ఆ వాహన దారులకు శిక్షకు గురవుతారన్నారు. బకాయి చలానాలు చెల్లించాలని కోరారు. సమావేశంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

Related posts

స్వయంకృషితో పైకి వచ్చిన నాయకుడు డాక్టర్ బి.అర్అంబేద్కర్ ఉరికిటి గణేష్

TV4-24X7 News

జగన్‌దే ఆలస్యం.. నారా లోకేష్‌తో రాజీనామా చేయించే చాన్స్ !

TV4-24X7 News

తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌కు ఎమ్మెల్యేలు.. సజ్జలతో భేటీ

TV4-24X7 News

Leave a Comment