TV9 రిపోర్టర్‌ను కాంగ్రెస్ నేత హత్య చేస్తానంటూ చేసిన బెదిరింపులపై ఎస్పీకి వినతిపత్రం ఇచ్చిన జర్నలిస్టు జేఏసీ
ఆదిలాబాద్ – టీవీ 9 రిపోర్టర్ నరేష్ ఒక వార్త రాస్తే దానిపై కోపమైన కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి కంది శ్రీనివాస్ రెడ్డి చంపుతానంటూ బెదిరించాడు. అలాగే తన అనుచరులను జర్నలిస్ట్ నరేష్ ఇంటి ఆచూకీ తెలుసుకునేందుకు పంపాడు.దీనిపై తమకు తాము ఏ రాజకీయ పార్టీకి, ఏ నాయకునికి వత్తాసు పలకకుండా నిష్పక్షపాతంగా వార్తలు రాస్తున్నమని.. జర్నలిస్టులపై కొందరు నాయకులు బెదిరింపులు, భౌతిక దాడులు దిగేందుకు యత్నిస్తున్నారని ఇలాంటి చర్యలను అరికట్టలని జర్నలిస్టు జేఏసీ నాయకులు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌష్ అలంని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.