విశాఖపట్నం విశాఖ మెట్రో రీజయన్ డవలప్మెంట్ ఆధారిటీ(విఎంఆర్డిఎ) నూతన కమిషనర్ కెఎస్ విశ్వనాధన్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు విఎంఆర్డిఎ అధికారులు, సిబ్బంది ఘన స్వాగతం పలికారు.అనంతరం విఎంఆర్డిఎ ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రాజెక్టులు, పరిపాలన పరమైన అంశాలు, తదితర వాటిపై అధికారులను అడిగి తెలుసుకునా ్నరు.ఈ సందర్భంగానే అర్బన్ ఫారెస్టు విభాగం అధికారులతో సమీక్ష సమా వేశం నిర్వహించి ఆయా విభాగాల సిబ్బంది వివరాలు, విధివిధానాలను కార్యదర్శి కీర్తి, డిఎఫ్వో శాంతిస్వరూప్లను అడిగి తెలుసుకన్నారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా నూతన కమిషనరు జాయింట్ కమిషనర్ రవీంద్ర, కార్య దర్శి కీర్తి, ఎస్టేట్ అధికారి లక్ష్మారెడ్డి, ప్రధాన ఇంజనీర్ భవానీశంకర్, పర్యవేక్షక ఇంజనీర్ బలరామరాజు, డిఎఫ్వోశాంతి స్వరూప్, ముఖ్య గణాంకాధికారి హరిప్రసాద్, సీయూపి సంజయ్ రత్నకుమార్ పలువురు అధికారులు, సిబ్బంది నూతన కమిషనర్ను మర్యాద పూర్వకంగా కలిసి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
