నాగార్జున సాగర్ నీటిని ఇవాళ సాయంత్రం విడుదల చేయనున్నారు. నాగార్జునసాగర్ జలాశయానికి 3.69 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. సాగర్ నీటి నిల్వ సామర్థ్యం 312.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 182.65 టీఎంసీలుగా ఉంది. ప్రవాహం పెరుగుతున్నందున సాయంత్రం నాగార్జున సాగర్ నుంచి మంత్రులు పొంగులేటి, ఉత్తమ్, తుమ్మల, కోమటిరెడ్డి నీరు విడుదల చేయనున్నారు.
