అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. క్యాబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం తెలపనున్నారు..స్థానిక సంస్థలు, సహకారం సంఘాల ఎన్నికల్లో ముగ్గురు పిల్లలు ఉంటే పోటీకి అనర్హులు అనే నిబంధనను రద్దు చేసే అవకాశముంది. దీనిపై భేటీలో చర్చిస్తున్నారు. వైకాపా హయాంలో ఎక్సైజ్ శాఖలో జరిగిన అవకతవకలు, మత్స్యకారులకు నష్టం చేకూర్చేలా గతంలో తీసుకొచ్చిన 217 జీవో రద్దుపై చర్చ జరుగుతోంది. మావోయిస్టులపై నిషేధం పొడిగిస్తూ క్యాబినెట్లో తీర్మానం చేసే అవకాశముంది..
