Tv424x7
National

సముద్రంలో మునిగిపోయిన ఓ నౌకలో 19 వ శతాబ్దం నాటి ఖరీదైన మద్యం ప్రభుత్వం ఏమి తీసిందో తెలుసా..?

అప్పుడెప్పుడో సముద్రంలో మునిగిపోయిన ఓ నౌకలో 19 వ శతాబ్దం నాటి ఖరీదైన మద్యం ఉన్నట్టు గుర్తించారు. దీంతో దానిని బయటకు తీయడానికి ఎవరు ప్రయత్నించవద్దని అధికారులు ఆదేశాలు జారీచేశారు. దక్షిణ స్వీడన్‌ సముద్ర తీరంలోని మునిగిపోయిన ఓ ఓడ శిథిలాల్లో 19వ శతాబ్దానికి చెందిన దాదాపు వంద బాటిళ్ల షాంపైన్, మినరల్ వాటర్‌ సీసాలను కనుగొన్నారు. సముద్రపు అడుగు భాగాన శిథిలమైన ఈ ఓడను 2016లోనే గుర్తించినప్పటికీ, గత నెలలో పోలండ్‌కు చెందిన స్కూబా డైవర్లు ఆ ఓడలోకి ప్రవేశించడంతో విలువైన మద్యం ఉన్నట్టు తెలిసింది.దక్షిణ స్వీడన్‌లోని బాల్టిక్‌ సముద్ర తీరానికి 20 నాటికల్ మైళ్లు ( 37 కిలోమీటర్లు) దూరంలో 190 అడుగుల లోతులో దీన్ని గుర్తించారు. జులై 11న పోలండ్ స్కూబా డైవర్లు అందులోని షాంపైన్, మినరల్ వాటర్ బాటిళ్లు ఉన్నట్టు కనుగొన్నారు. పురాతనమై ఈ మద్యాన్ని పరీక్షించేందుకు స్కూబా డైవర్లపై నిపుణులు ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో 1850 ప్రాంతానికి చెందినదిగా భావిస్తున్న మునిగిపోయిన నౌకను ‘పురాతన అవశేషం’గా స్వీడన్ అధికారులు ప్రకటించారు. ఈ మద్యం బయటకు తీయడం కుదరదని స్పష్టం చేశారు.మునిగిపోయిన నౌకలోని షాంపైన్ బాటిళ్లు సహా ఇతర వస్తువులను ఎటువంటి అనుమతి లేకుండా బయటకు తీసుకొచ్చి పురాతన అవశేషాలకు ఎటువంటి ముప్పు కలిగించవద్దు.. షాంపైన్ సీసాలు అద్భుతంగా సంరక్షించబడ్డాయి.. ఇవి 19వ శతాబ్దం చివరిలో నౌకాయాణం, జీవనశైలికి ప్రత్యక్ష సాక్ష్యం’ అని స్వీడన్ కౌంటీ అధికారి మాగ్నస్ జోహన్సన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘శిథిలాల సాంస్కృతిక, చారిత్రక విలువలు చాలా ఎక్కువగా ఉన్నాయని మేము గుర్తించాం., దానిని పురాతన అవశేషంగా ప్రకటించాలి’ అని మరో అధికారి వ్యాఖ్యానించారు.కాగా, స్టాక్‌హోంలోని రాజ కుటుంబానికి లేదా సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లోని రష్యన్‌ జార్‌ చక్రవర్తికి ఈ మద్యం తరలిస్తుండగా ఓడ మునిగిపోయి ఉండొచ్చని థామస్ స్టాచురా అనే స్కూబా డైవర్‌ తెలిపారు. ప్రస్తుతం ఈ శిథిలమైన నౌక సముద్రం అడుగున 58 మీటర్ల లోతులో ఉందని అన్నారు. అందులోని వైన్, మినరల్ వాటర్‌ను బయటకు తీసుకొచ్చి.. ల్యాబ్‌లో పరీక్షించేందుకు డైవర్లను నిపుణులు సంప్రదిస్తున్నారని అతడు వెల్లడించాడు.

Related posts

నేడు కల్కిధామ్‌కు ‍ప్రధాని మోదీ శంకుస్థాపన

TV4-24X7 News

రియల్‌మి నుంచి వాటర్‌ప్రూఫ్ 5G ఫోన్‌.. ఫీచర్లు ఇవే..

TV4-24X7 News

23 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం

TV4-24X7 News

Leave a Comment