Tv424x7
Andhrapradesh

ప్రయాణికుడి ఫిర్యాదుతో వెంటనే తనిఖీలు చేపట్టిన ఫుడ్ సేఫ్టీ అధికారులు..!

పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ లో ఆహారం నాణ్యత లేదంటూ ప్రయాణికుడు ఫిర్యాదు. రాత్రి సమయం అయినప్పటికిని వెంటనే తనిఖీలు చేపట్టిన ఫుడ్ సేఫ్టీ అధికారులు. శుక్రవారం హైదరాబాదు నుండి తిరుపతికి ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న హైకోర్టు న్యాయవాది అయిన దద్దాల జగదీష్ రాత్రి సమయంలో భోజనం కొరకు నంద్యాల ఆర్టీసీ బస్టాండులో ని మమతా క్యాంటీన్లో ఆహారము ఆర్డర్ ఇవ్వగా క్యాంటీన్ నిర్వాహకులు ఇచ్చిన భోజనం నాణ్యత లేకపోవడంతో వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులకు చరవాణి ద్వారా ఫిర్యాదు చేయగా స్పందించిన అధికారులు వెంటనే తనిఖీలు చేపట్టి క్యాంటిన్లోని పలు ఆహార పదార్థాలను శాంపిల్స్ సేకరించి పరీక్ష నిర్వహణకై హైదరాబాద్లోని ల్యాబ్ కు పంపించినట్లు సమాచారం. ఫిర్యాదు మేరకు తనిఖీలు చేపట్టి శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపించడంతోపాటు క్యాంటీన్ నిర్వహకులపై చర్యలకు పై అధికారులకు నివేదిక సమర్పించడం జరుగుతుందని, తదనుగుణంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు క్యాంటీన్ నిర్వహకుల పై కేసు నమోదు చేయడం కూడా జరుగుతుందని తెలిపిన ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంకటరాముడు, ఖాసిం వలి.

Related posts

ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలు

TV4-24X7 News

నా జీవితంలో ఇన్ని డ్రామాలు ఎప్పుడూ చూడలేదు: సీఎం

TV4-24X7 News

మనిషి చనిపోయిన తర్వాతైనా ప్రభుత్వం కనికరించకపోతే ఎలా?: చంద్రబాబు

TV4-24X7 News

Leave a Comment