విశాఖపట్నం ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలను శ్రీ స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థ వారు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఝాన్సీ లక్ష్మీబాయి చిత్రపటానికి పూలమాల సమర్పించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు అప్పారావు సీనియర్ సభ్యులు డి లక్ష్మణరావు మాట్లాడుతూ, ఝాన్సీ లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక అని, 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి స్వాతంత్ర్య సంగ్రామంలో మొదటి పాత్ర పోషించింది . ఝాన్సీ అనే రాజ్యానికి రాణి కాబట్టి ఝాన్సీ రాణిగా పిలవబడింది. విద్యార్థులందరూ ఝాన్సీ లక్ష్మీబాయి ని ఆదర్శంగా తీసుకొని, దేశభక్తితో మెలగాలని అప్పారావు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు మరియు ట్యూషన్ విద్యార్థులు పాల్గొన్నారు.
previous post

