హైదరాబాద్ సెప్టెంబర్ 15: ఇప్పటివరకు హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన లడ్డూగా.. బాలాపూర్ గణేషుని లడ్డూ మాత్రమే ఉండేది. కాగా.. ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేశాడు మాదాపూర్ మైహోమ్ భుజా వినాయకుడు. గతేడాది బాలాపూర్ గణేషుడు సృష్టించిన రికార్డును బ్రేక్ చేసి.. మరో కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేశాడు. మాదాపూర్ మైహోమ్ భుజాలో గణేషుని లడ్డూకు నిర్వహించిన వేలానికి విశేష స్పందన లభించింది. హోరాహోరీగా సాగిన వేలంలో లడ్డూ రూ.29 లక్షలు పలికింది.మాదాపూర్ మైహోమ్ భుజా గణేషుని లడ్డూ రికార్డ్వేలంలో రూ.29 లక్షలు పలికిన గణనాథుని లడ్డుబాలాపూర్ గణేష్ లడ్డూ గత రికార్డు బ్రేక్అత్యంత ఖరీదైన లడ్డూగా మాదాపూర్ మైహోమ్ భుజా గణేషుడు కొత్త రికార్డు సృష్టించాడు. ఎప్పటిలాగానే.. మైహోం భుజా అపార్ట్ మెంట్స్‌లో ప్రతిష్ఠించిన వినాయకుడి లడ్డూకు వేలం పాట నిర్వహించగా.. విశేష స్పందన లభించింది. వేలం పాట అంతే హోరా హోరీగా సాగింది. ఈ హోరా హోరి వేలం పాటలో.. గణేషుని లడ్డూ ఏకంగా 29 లక్షలు పలికింది. ఖమ్మంకు చెందిన కొండపల్లి గణేష్.. వినాయకుడి లడ్డూను రూ. 29 లక్షలకు సొంతం చేసుకున్నాడు. దీంతో.. హైదరాబాద్ మహానగరంలోని అత్యంత ఖరీదైన ధర పలికిన లడ్డూగా.. మైహోం భుజా గణనాథుని లడ్డూ నిలిచింది.

previous post