మైదుకూరు : మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆదేశాలతో మైదుకూరు మున్సిపాలిటీలోని శాంతినగర్ ఏరియాలో ఉన్న కేసీ కెనాల్ కాలువపై, తుమ్మ చెట్ల పొదలను టీడీపీ క్లస్టర్ 21, 22వ వార్డు ఇన్ఛార్జి ఆకుల.కృష్ణయ్య ఆధ్వర్యంలో జేసీబీ ద్వారా శుక్రవారం తొలగించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉండేందుకు శాంతినగర్ కేసీ కెనాల్ కట్టమీద ఉన్న వ్యర్థాలను పరిశుభ్రం చేశారు. శాంతినగర్ బూత్ ఇన్ఛార్జి ఐ.ప్రసాద్, సుధాకర్, దేవ, తదితరులు పాల్గొన్నారు.

previous post