విశాఖపట్నం స్థానిక 32 వ వార్డులో గలఏడుగుళ్ళ ప్రాంత నివాసితులకు పక్కా గృహాలు నిర్మించాలనివిశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు కోరారు.ఆయన జీవీఎంసీ కమిషనర్ శనివారం నాడు కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు.సందర్భంగా కందులు నాగరాజు మాట్లాడుతూ 75 ఏళ్ల నుంచి విశాఖలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోని ఆ ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలని అభ్యర్థించారు. నగరంఎంతగా అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతం మాత్రం ఎటువంటి అభివృద్ధికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.తప్పకుండా జీవీఎంసీ కమిషనర్ ఈ సమస్యపై దృష్టి సారించి వారికి న్యాయం చేయాలని కోరారు.అలాగే నేరెళ్ల కోనేరు చుట్టుపక్క ప్రాంతాలలో సుమారు 5000 మంది నివసిస్తున్నారని వారికి ఎటువంటి కళ్యాణ మండపం కానీ లేదా ప్లే గ్రౌండ్ కానీ లేదని చెప్పారు.నేరెళ్ల కోనేరు సమీపంలో గల సిపిఐ ఆఫీస్ వద్ద ఉన్న ప్రాంతంలో ఈ రెండు నిర్మాణాలు చేపట్టేందుకు కమిషనర్ సహకరించాలని వెల్లడించారు.కమిషనర్ తప్పకుండా తమ అభ్యర్థులకు సానుకూలంగా స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కందుల నాగరాజు కోరారు.
previous post