Tv424x7
Andhrapradesh

వేదాంత వి.జి.సీ.బి పోర్టు ద్వారా ఉచిత ఉపాధి శిక్షణ పొందిన వారికి నియామక పత్రాలు అందజేత

విశాఖపట్నం వన్ టౌన్ వేదాంత లిమిటెడ్ -వైజాగ్ జనరల్ కార్గో బెర్త్ (విజిసిబి), ప్రాజెక్టు దిశ లో భాగంగా సెమ్స్ లో పోర్ట్ పరిసర ప్రాంత మరియు జీవీఎంసీ పరిధిలోని 90 మంది నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి ఆధారిత నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా మొదటి బ్యాచ్లో శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులకు నియామక పత్రాలను దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ చేతులమీదుగా అందచేయటం జరిగిందని సెమ్స్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కే. సేతు మాధవన్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వంశీ కృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ వేదాంత సి.ఎస్.ఆర్ లో భాగంగా విశాఖపట్నం లో ప్రజల అభివృద్ధి కోసం విద్య, వైద్యం, మహిళల కు స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాలు మరియు ఉపాధి కల్పన పై చేస్తున్న కృషి అభినందించదగ్గ విషయం అని అన్నారు మరియు ముఖ్యమంత్రి ఆదేశానుసారం కూటమి ప్రభుత్వం ఏడాదికి 1,20,000 మంది నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి ఉపాధి కల్పించటం లక్ష్యంగా పెట్టుకుందని దీనిలో భాగంగా వి.జి.సి.బి పోర్టు లాంటి సంస్థల అవసరం ఎంతో ఉందని తెలియచేశారు. ఈ సందర్భంగా విజయవంతంగా శిక్షణ కార్యక్రమం పూర్తి చేసుకుని అమెజాన్, సన్ రైస్ సొల్యూషన్స్, ప్లేస్మెంట్ పార్క్ వంటి సంస్థలలో ఉపాధి పొందిన 26మంది మహిళా అభ్యర్థులకు నియామక పత్రాలు అందచేశారు.వీజీసీబీ సంస్థ సి ఓ ఓ పవన్ కుమార్ మాట్లాడుతూ, మొదటి బ్యాచ్ లో ౩౦ మంది మహిళా అభ్యర్థులకు ఇన్వెంటరీ కంట్రోలర్ కోర్సులో శిక్షణ ఇచ్చామని మరియు ౩౦ మందితో ఎలక్ట్రీషియన్ బ్యాచ్ ఈ రోజు నుండి ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీజీసీబీ పోర్టు సి.ఏస్.ఆర్ హెడ్ శ్రీలక్ష్మి, క్రీన విపుల్ మరియు సెమ్స్ నుండి సి ఓ ఓ కమాండర్ గోపి కృష్ణ శివ్వం, (రిటైర్డ్), ప్రాజెక్ట్ హెడ్ ప్రజీత్ కురుప్ పాల్గున్నారు.

Related posts

ఏపీలో మద్యం ధరలు తగ్గించుకున్న 11 కంపెనీలు – క్వార్టర్‌పై రూ.30 వరకు తగ్గుదల

TV4-24X7 News

తల్లిని చంపిన కేసులో తనయుడి అరెస్టు– కళ్యాణదుర్గం రూరల్ సి.ఐ నాగరాజు

TV4-24X7 News

ప్రధాని నివాసానికి బయలుదేరిన కిషన్ రెడ్డి, బండి సంజయ్తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్‌లో సికింద్రాబాద్ ఎంపీ కిషన్‌రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కి చోటు దక్కింది. పీఎంవో నుంచి సాయంత్రం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయాలంటూ ఇద్దరి నేతలకు ఫోన్‌ వచ్చింది. దీంతో ఢిల్లీలోని కిషన్‌రెడ్డి నివాసం నుంచి బండి సంజయ్‌ ఒకే కారులో ప్రధాని నివాసానికి బయలుదేరారు. ముందుగా అక్కడ జరిగే తేనేటి విందుకు హాజరై ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లనున్నారు.

TV4-24X7 News

Leave a Comment