Tv424x7
Andhrapradesh

అమెరికాలో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ కు ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు

హైదరాబాద్:సెప్టెంబర్ 23ప్రధాని మోదీ అమెరికా పర్యటన వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అమెరికాలో ప్రవాస భారతీయుల సదస్సు ఏర్పాటు చేయగా ప్రధాని మోదీ దీనికి హాజర య్యారు. అయితే ఈ ఈవెంట్ లో అనేకమంది ఇండియన్ కళాకారులు ప్రత్యేక ప్రదర్శనలు ఇవ్వగా మన మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ కూడా స్పెషల్ ప్రఫార్మెన్స్ ఇచ్చారు. పుష్ప సినిమాలోని శ్రీవల్లి సాంగ్ తో అక్కడి ప్రేక్షకులని అలరించారు.అనంతరం దేవి శ్రీ ప్రసాద్, హనుమాన్‌కైంద్, ఆదిత్య గాధ్వి.. హర్ ఘర్ తిరంగా పాట పాడుతూ ప్రధాని మోదీకి స్టేజిపైకి ఆహ్వానం పలికారు. స్టేజిపైకి వచ్చిన ప్రధాని మోదీ, దేవి శ్రీ ప్రసాద్ ని దగ్గరకు తీసుకొని కౌగలించుకొని అభినం దించి ప్రశంసల వర్షం కురిపించారు.దేవితో పాటు స్టేజిపై ఉన్న మిగిలిన కళాకారులను కూడా దగ్గరకు తీసుకొని మోదీ అభినందించారు. దీంతో ఆ వీడియోలు వైరల్ గా మారాయి. అమెరికాలో ప్రవాస భారతీయుల ఈవెంట్లో స్టేజిపై మన మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ని ప్రధాని మోదీ అభినందిం చడం విశేషం.

Related posts

తెలుగుదేశం పార్టీ మహానాడు వాయిదా

TV4-24X7 News

అత్తింటి ఆస్తిపై అల్లుడి కన్ను.. సిని ఫక్కీలో బావ మరిది ని హత్య! చేసిన బావ.. సీన్ కట్‌చేస్తే పోలీసుల దర్యాప్తు లో ఊహించని ట్విస్ట్..

TV4-24X7 News

2027లో జమిలీ వస్తే 2028లో జగన్ పాదయాత్రతో ఏం ప్రయోజనం..?

TV4-24X7 News

Leave a Comment