Tv424x7
Telangana

గాంధీ ఆసుపత్రికి వెళ్తున్న వైద్య కమిటీ సభ్యుల హౌజ్ అరెస్ట్

రాష్ట్రంలో దిగజారుతున్న వైద్య ఆరోగ్య పరిస్థితులు.. గాంధీ ఆసుపత్రిలో జరుగుతున్న మరణాల విషయంలో అధ్యయనం చేయడానికి ఆసుపత్రికి బయల్దేరక ముందే వైద్య కమిటీ సభ్యులని హౌజ్ అరెస్ట్ చేసిన పోలీసులు.రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య సేవల విషయంలో అధ్యయనం చేసేందుకు… ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చేందుకు భారత రాష్ట్ర సమితి ఏర్పాటు చేసిన ముగ్గురు డాక్టర్లతో కూడిన బృందాన్ని అడ్డుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం.ఇప్పటికే కమిటీ అధ్యక్షులు మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య, ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఇండ్ల వద్దకు చేరుకున్న పోలీసులు.ముగ్గురు నాయకులను అరెస్టు చేసేందుకు పోలీసుల ప్రయత్నం.ఆసుపత్రుల సందర్శనకు వెళ్లి పరిస్థితులను పరిశీలిస్తామంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది అన్న బిఆర్ఎస్ నాయకులు.రాజకీయాల కోసం కాకుండా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందేలా ప్రభుత్వానికి సూచనలు ఇచ్చేందుకు నిపుణులైన డాక్టర్లుగా తాము గాంధీ ఆసుపత్రికి వెళ్తామంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతుందని ప్రశ్నించిన కమిటీలోని నాయకులు.గాంధీ ఆసుపత్రిలో మా పార్టీ ప్రస్తావించిన మాతా శిశు మరణాల విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దాచిపెడుతుందా… లేదా తమ పరిపాలన వైఫల్యం బయటకు వస్తుందని భయపడుతుందని తెలిపిన నాయకులు.పోలీసులు తమ ఇండ్ల నుంచి వెంటనే వెళ్లిపోవాలని కోరిన నాయకులు. ప్రభుత్వం ఇప్పటికైనా ఇలాంటి పిరికిపంద చర్యలను ఆపాలని ఆగ్రహం.

Related posts

పాలనపై విసిగిపోయిన ప్రజలు : ఎమ్మెల్యే హరీశ్‌రావు…

TV4-24X7 News

గజ్వేల్ శ్రీరామ్ ఫైనాన్స్ నందు ఉద్యోగ అవకాశాలు

TV4-24X7 News

మా పెళ్ళికి రండి: సీఎం రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన పీవీ సింధు!

TV4-24X7 News

Leave a Comment