విశాఖపట్నం వేదాంత-వి.జి.సి.బి పోర్టు వారి ఆధ్వర్యంలో మత్స్యకారుల సామాజిక భవనం, వన్ టౌన్ ఏరియా లో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సి.హెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్, విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సి.హెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ వేదాంత సి.ఎస్.ఆర్ కార్యక్రమంలో భాగంగా ఈ ఏరియా లోని ప్రజలకు మెగా హెల్త్ క్యాంప్ పెట్టీ ఉచిత మందులు , కళ్లజోళ్లు పంపిణీ చేయడం చాలా మంచి విషయం అని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన 39 వ వార్డ్ కార్పొరేటర్ మహ్మద్ సాధిక్ మాట్లాడుతూ వేదాంత ద్వారా 39వ వార్డ్ లో అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి అని రానున్న రోజుల్లో అనేక కార్యక్రమాలు చేయాలని కోరారు. ఈ సంధర్భంగా విచ్చేసిన వి.జి.సి.బి పోర్టు సి.ఈ. ఓ సతీష్ కుమార్ మాట్లాడుతూ వేదాంత ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందనీ వాటితో పాటు ఈ సంవత్సరంలో 100 మంది యువతకు 2 నెలల శిక్షణ మరియు వారికి ఉపాధి కల్పించే విధంగా కార్యక్రమం జరుగుతుంది అని రానున్న రోజుల్లో ఇంకా అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చేతుల మీదగా ఉచిత కళ్లజోళ్లు మరియు ఉచిత మందులు రోగులకు పంపిణీ చేయడం జరిగింది. గీతం హాస్పిటల్ నుండి ఎనిమిది విభాగాల డాక్టర్స్ ద్వారా వైద్య సేవలు అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మత్స్యకారుల సంఘ పెద్ద కదిరి అప్పారావు, శిరిన్ రెహమాన్, ప్రెసిడెంట్, చైతన్య స్రవంతి, స్థానిక నాయకులు చిన్న, దానేష్, రాజు, వి.జి.సి.బి పోర్టు సి.ఎస్.ఆర్ హెడ్ శ్రీ లక్ష్మీ, ఆఫ్రో సంస్థ రీజనల్ మేనేజర్ సన్నీ మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
