విశాఖపట్నం పుష్పవతి అయిన అమ్మాయిలకు విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు,32వ వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు తన పరిధి మేరకు సహాయం చేశారు.శనివారం ఉదయం 32వ వార్డు నేరెళ్ల కోనేరు ప్రాంతంలో పుష్పవతి అయిన నవ్య, చాందిని అనే ఇద్దరు అమ్మాయిలకు పట్టుబట్టలు, వెండి పట్టీలు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా నవ వధువులకు పట్టుబట్టలు అలాగే బంగారు తాళిబొట్టు ఇస్తున్నట్లు చెప్పారు అదేవిధంగా పుష్పవతి అయిన అమ్మాయిలకు పట్టు బట్టలు, వెండి పట్టీలు ఇస్తున్నట్లు వెల్లడించారు.32 వ వార్డు పరిధి మేరకే కాకుండా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలలో తన సేవలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.ఎవరికి ఇటువంటి సమస్య వచ్చిన అలాగే సహాయం కావలసి వచ్చిన తాను అక్కడ ఉండి తన పరిధి మేరకు వారికి తన సహాయ సహకారాలు అందజేయడం జరుగుతుందని తెలియజేశారు.నియోజకవర్గ ప్రజలకు తాను 24 గంటలు అందుబాటులో ఉంటానని ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా తనను నేరుగా కలవవచ్చు అని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో విందుల రవణ , శాలివాహన , నూకరాజు , అప్పలరాజు , గండి అప్పలరాజు , అశోక్ , లుక్స్ గణేష్ ,( టమాటా ) అప్పారావు , వర , కోదండమ్మ , రవణమ్మ , కుమారి , కందుల కేదార్నాథ్ , కందుల బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.

previous post