ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎం ఎస్ ఎం ఈ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన జనసేన సీనియర్ నాయకులు శివ శంకర్ కు విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు,32 వ వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు అభినందనలు తెలియజేశారు.జనసేన పార్టీ బలోపేతానికి, పార్టీ నాయకత్వాన్ని ఏకతాటిపై తీసుకురావడంలో శివశంకర్ చేసిన ప్రయత్నం పట్ల హర్షం వ్యక్తం చేశారు.శివశంకర్ ఎంపిక సందర్భంగా కందుల నాగరాజు ఆయన కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా కందుల నాగరాజు మాట్లాడుతూ విశాఖలో జనసేన పార్టీ బలపడడానికి శివశంకర్ చేసిన కృషి అమోఘమని కొనియాడారు.రాష్ట్రస్థాయిలో కూడా పార్టీ కోసం ఆయన చేసిన సేవలను ప్రశంసించారు.ఆయన చేసిన సేవలు గుర్తింపుగా కార్పొరేషన్ చైర్మన్ పదవి లభించిందని చెప్పారు.పార్టీ నాయకులను, కార్యకర్తలను, అభిమానులను ఏకం చేసిన ఘనతను ఆయన సొంతం చేసుకున్నారని పేర్కొన్నారు.భవిష్యత్తులో ఆయన మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అభిలాషించారు.ఈ కార్యక్రమంలో విందుల రమణ, ఎం. శాలివాహన, సిపిఐ బుజ్జి, లుక్స్ గణేష్,టమాట అప్పారావు, నూకరాజు, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.
