Tv424x7
Andhrapradesh

ద్రోణంరాజు శ్రీనివాస్ లోటు తీరనిది నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్

విశాఖపట్నం ద్రోణంరాజు శ్రీనివాస్ లోటు విశాఖకు తీరనిదని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. శ్రీ స్వామి వివేకానంద స్వచ్చంద సేవా సంస్థ అనాధాశ్రమంలో ఆయన కుమారుడు శ్రీవాత్సవ్ ఆధ్వర్యంలో 4వ వర్ధంతి సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టారు. దక్షిణ వైసీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్కుమార్, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్ పలువురు శ్రీనివాస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఎప్పుడు చిరునవ్వు చిందిస్తూ పేదవారు అంత వారి కుటుంబ సభ్యులు మాదిరిగా పలకరిస్తూ సేవలందించే ద్రోణం రాజు శ్రీనివాసరావు భౌతికంగా దూరం కావడం విశాఖ కు తీరని లోటు అన్నారు. ద్రోణం రాజు సత్యనారాయణ చేసిన సేవలను ఆదర్శంగా తీసుకొని ద్రోణం రాజు శ్రీనివాస్ విశాఖకు ముఖ్యంగా దక్షణ ప్రజలకు ఎంతో సేవ చేశారన్నారు. వారి నివాసమే రాజకీయ విశ్వవిద్యాలయం అని కొనియాడారు. ద్రోణంరాజు శ్రీవాత్సవ మాట్లాడుతూ తన తాత, తండ్రి ఆశయాలు ముందుకు తీసుకువెళ్తానని, వారి లేని లోటును తీర్చలేకపోయినా, వారి స్ఫూర్తితో ప్రజలకు సేవ చేస్తానని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గ వైసీపీ శ్రేణులు, బెహరా భాస్కర్, కార్పొరేటర్లు చెన్న జానకిరామ్, మాజీ క్రిస్టియన్ మైనారిటీ చైర్మన్ జాన్ వెస్లీ, డాక్టర్ జహీర్ అహ్మద్, నాయకులు కార్యకర్తలు, స్వచ్ఛందన సేవా సంస్థ ప్రతినిధులు, సూరాడ అప్పారావు, ద్రోణంరాజు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

మంత్రులు, ఎమ్మెల్యేలు నెలకు 4 రోజులు పల్లె నిద్రలు చేయాలి: సీఎం చంద్రబాబు

TV4-24X7 News

స్కూల్‌ విద్యార్ధులకు మంత్రి లోకేశ్‌ తీపికబురు.. ఇక ప్రతి శనివారం పండగే!*

TV4-24X7 News

పరవాడ గ్రామం లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన గండి బాబ్జీ

TV4-24X7 News

Leave a Comment