Tv424x7
Political

రాజకీయాలకు గుడ్‌బై చెప్పిన పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు

కారంచేడులో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ వ్యాఖ్యలురాజకీయంగా ఇదే తన చివరి ప్రసంగమని వెల్లడి మిగతా జీవితాన్ని పుస్తకాలు రాసుకుంటూ గడిపేస్తానన్న నేతకోట్లు ఖర్చు చేసి గెలిచినా ప్రజల నుంచి చీత్కారాలు తప్పడం లేదని ఆవేదనసీనియర్ రాజకీయ నాయకుడు, బీజేపీ నాయకురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయాల నుంచి తప్పుకున్నారు. బాపట్ల జిల్లా కారంచేడులో నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, పురందేశ్వరి, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతో కలిసి పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాజకీయాలు పూర్తిగా డబ్బుమయంగా మారిపోయాయని, కోట్ల రూపాయలు ఖర్చు చేసి గెలిచినా ప్రజల నుంచి చీత్కారాలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇందుకు సంబంధించి ఓ ఉదాహరణ కూడా చెప్పారు.ఓడరేవులో ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు చీరాల ఎమ్మెల్యే కొండయ్య గజ ఈతగాళ్లను ఏర్పాటు చేసి వారికి జీతాలు చెల్లించేలా రిసార్ట్స్ వాళ్లతో మాట్లాడారని, కానీ, కొండయ్య డబ్బులు వసూలు చేస్తున్నారని వార్తలు రాశారని పేర్కొన్నారు. వరద బాధితులకు సాయం చేసేందుకు వైశ్య కమ్యూనిటీ నుంచి విరాళాలు సేకరించే సమయంలోనూ ఇలాంటి వార్తలే రాశారని తెలిపారు. డబ్బులు ఖర్చు చేసి రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేద్దామన్నా ఆరోపణలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.

Related posts

పల్నాడు జిల్లా లో సిట్టింగులకు ఎసరు – వైసీపీలో కలకలం

TV4-24X7 News

మంత్రి రజిని.. వ్యూహం ఫలించేనా.?

TV4-24X7 News

రెండో రోజు ఢిల్లీలో బిజీ బిజీగా రేవంత్ రెడ్డి పర్యటన

TV4-24X7 News

Leave a Comment