కడప /మైదుకూరు మండలంలో ఫ్రీహోల్డ్ భూములపై జరిగిన అవకతవకలపై 15 మందికి నోటీసులు జారీ చేసి.. వారు సంజాయిషీను సమర్పించాలని ఆదేశించినట్లు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారుమైదుకూరు మండలంలో ఫ్రీహోల్డ్ భూములపై వచ్చిన ఆరోపణల మేరకు రీ ఎంక్వయిరీ చేసి అక్కడ జరిగిన అవకతవకలు/ తప్పులు జరిగినట్లు గుర్తించామన్నారు. దీంతో ఆ సమయంలో అక్కడ పనిచేసిన ఒక తహశీల్దార్ తో పాటు 14 మంది వీఆర్వోలపై క్రమశిక్షణా చర్యలు తీసుకొనుటకు గాను నిర్ణయించి వారి నుండి వివరణ (explanation) సమర్పించాలని ఉత్తర్వులు జారీచేశామన్నారు. వారి నుండి వివరణ /సంజాయిషీ లు అందిన తరువాత తదుపరి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.

previous post
next post