విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం హార్బర్ విభాగం ట్రాఫిక్ సిఐ ఎస్ షణ్ముఖరావు వాహనదారులను హెచ్చరించారు. వరస రోడ్డు ప్రమాదాలలో హెల్మెట్ దారణ లేకుండా ఉండేవారే ఎక్కువగా చనిపోతున్నారని కొన్ని సర్వేలు వెల్లడించాయని ఆయన అన్నారు. ఈ మేరకు ఇదే అంశంపై సిటీ పోలీస్ కమిషనర్ శంకాబ్రత బగ్చి పలు సూచనలు తెలియజేశారని ఆయన అన్నారు. హెల్మెట్ ను వాహనదారులు పోలీసువారి నుంచి రక్షణ కోసం పెట్టుకోకూడదని తమ రక్షణ కోసం పెట్టుకోవాలని సూచించారు. ఈ మేరకు నేవెల్ డాక్ యార్డ్ లో ఓ ఉద్యోగి వాహనం ప్రయాణం చేస్తుండగా తలకు బలమైన గాయం తగలడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే ఆ సమయంలో మృతుడు హెల్మెట్ పెట్టుకున్నాడు తప్ప హెల్మెట్ ని లాక్ చేయడం మర్చిపోవడంతో కింద పడిపోయిన వెంటనే హెల్మెట్ పక్కకు వెళ్లిపోయింది ఆ సమయంలో హెల్మెట్ అతనికి రక్షణ ఇచ్చేది హెల్మెట్ ని ఫ్యాషన్ గా కాకుండా రక్షణ కవచంగా ప్రతి ఒక్కరు మలుచుకోవాలని తెలియజేశారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు సిటీ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు సెప్టెంబర్ నెల నుంచి వాహనదారుడు మరియు వెనుక కూర్చున్న వ్యక్తి కూడాతప్పనిసరిగా హెల్మెట్ ధరించే నిబంధన తీసుకొచ్చామని సిటీలో ఇప్పటికే ఆ నిబంధన కొనసాగుతుందని ఆయన తెలియజేశారు. హెల్మెట్ పెట్టుకోకపోతే 1035 రూపాయలు అపరాధ రుసుము వేయడం జరుగుతుందని, అలాగే మూడు నెలలు లైసెన్స్ సస్పెండ్ చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ విషయాన్ని గమనించి ట్రాఫిక్ వారి నిబంధనలకు సహకరించాలని ఆయన కోరారు. ఇప్పటివరకు పారిశ్రామిక ప్రాంతంలో 1500 మంది వాహన చోదకుల లైసెన్స్ సస్పెండ్ చేయడం జరిగిందని సమాచారం తెలిపారు.

previous post
next post