విశాఖపట్నం గోపాలపట్నం క్రైమ్ ఎస్ఐ గా నూతన బాధ్యతలు స్వీకరించిన జి తేజేశ్వరరావు. 2012 బ్యాచ్ కి చెందిన తేజేశ్వరరావు ఆదివారం గోపాలపట్నం క్రైమ్ ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు విశాఖపట్నం సిటీ నందు సైబర్ క్రైమ్, త్రి టౌన్, గోపాలపట్నం లాఅండ్ ఆర్డర్ ఎస్సైగా పనిచేశారు. గాజువాక, స్టీల్ ప్లాంట్ క్రైమ్ ఎస్ఐ గా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ నుండి గోపాల పట్నం క్రైమ్ పోలీస్ స్టేషన్ కు బదిలీ పై వచ్చారు. ఆయనకు స్టేషన్ సిబ్బంది పుష్ప గుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
