Tv424x7
Andhrapradesh

పేద కుటుంబానికి ఐదు వేలు సాయం చేసిన వాసుపల్లి

విశాఖపట్నం 39 వ వార్డుకు చెందిన కదిరి అప్పారావు కుటుంబానికి 5 వేలు రూపాయలను ఆర్థిక సాయం మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ అందజేశారు. ఆశీలమెట్ట కార్యాలయంలో బుధవారం ఉదయం సొంత నిధులతో రూ.5 వేలు ఆర్థిక సాయం చేశారు. కదిరి అప్పారావు తల్లి కదిరి కళ్యాణి ఇటీవల మరణించడంతో ఆమె వర్ధంతి ఖర్చులకు ఇచ్చారు. దక్షిణ నియోజకవర్గ ప్రజలతో తనది విడదీయరాని బంధమని, వారి కష్టాలు తనవిగా భావించి తన వంతు సాయంగా ఈ మొత్తాన్ని అందించినట్లు వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు. తాను అధికారకంలో లేకపోయినా ప్రజల నుండి తనను వేరు చేయలేరని స్పష్టం చేశారు. దక్షిణ ప్రజల ఆదరణకు తాను ఎప్పుడూ రుణపడే ఉంటానని , ప్రజలకు సేవ చేయడమే తనకెంతో సంతృప్తినిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కదిరి కళ్యాణి బంధువులు, వైసిపి నాయకులు చింతకాయల వాసు, ఆకుల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

పెందుర్తి నియోజక వర్గంలో తెలుగుదేశం పార్టీ అత్యధిక సభ్యత్వ నమోదు చేయాలి గండి బాబ్జీ

TV4-24X7 News

అధికారులకు తలనొప్పిగా మారిన రేషన్ మాఫియా..

TV4-24X7 News

చంద్రబాబు పై కామెంట్స్ – దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు

TV4-24X7 News

Leave a Comment