సూపర్ సిక్స్ లో ఒక్క సిక్స్ కూడా కొట్ట లేదు కానరాని మత్స్య కార భరోసా
మాజీ సిఎం జగన్ తో భేటీ అయిన మాజీ ఎమ్మేల్యే వాసుపల్లి
విశాఖ పట్నం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మళ్ళీ వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి పాలననే కోరుకుంటున్నారు అని విశాఖ దక్షిణ నియోజక వర్గం మాజీ ఎమ్మేల్యే వాసు పల్లి గణేష్ కుమార్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన గురువారం మాజీ సిఎం జగన్ మోహన్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసి, పలు విషయాలు చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలు కూటమి ప్రభుత్వం పాలన, జగన్ పాలనను బేరీజు వేసుకుని ఆందోళన చెందుతున్నారు అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఇప్పటి వరకు ఒక్క సిక్స్ కూడా కొట్ట లేదు అని ఆయన ఎద్దేవా చేశారు. అలాగే, మార్చి 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం అన్నారు అని, ఎప్పుడు అమలు చేస్తారో తెలీని దుస్థితి నెలకొంది అన్నారు. తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లో ఉచిత బస్సు పథకం వల్ల ఆర్టీసీ కుదేలు అవ్వడం తో చంద్ర బాబు నాయుడు ఈ పథకం విషయంలో యు టర్న్ తీసుకున్నా ఆశ్చర్యం లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా నిరుపేద మత్స్య కారులకు భరోసా కోసం ఎదురు చూపులే మిగిలాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులు మీద రోజురోజు కి దాడులు పెరిగిపోతున్నాయి అని ఆందోళన వ్యక్తం చేశారు. సాక్షాత్తు, మహిళా హోం మంత్రి హయాంలో అత్యాచారాలు, దాడులు పెరగడం అన్యాయం అని దుయ్య బట్టారు. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు పించన్లు ఇచ్చే దిక్కు లేకుండా పోయింది అన్నారు. ఆటో డ్రైవర్లు, టైలర్లు , మహిళలు, పెద ప్రజలు గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పలు పథకాలు కింద ప్రయోజనం పొందారు అని గుర్తు చేశారు. విజయ నగర జిల్లా గుర్ల మండలంలో అతిసార వల్ల 13 మంది చనిపోవడం దురదృష్ట కరం అన్నారు. గ్రామాల్లో పారిశుధ్యం క్షీణిస్తుంది అన్నారు. ప్రాణ త్యాగాలతో సాధించుకున్న స్టీల్ ప్లాంట్ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతోంది అన్నారు. కూటమి ప్రభుత్వం ఈ విషయమై స్పష్టమైన హామీ ఇవ్వలేక పోతుంది అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో విశాఖ కార్య నిర్వాహక రాజధానిగా చేయడానికి బాటలు వేసిన ప్పటికి కూటమి తూట్లు పొడిచి ఉత్తరాంధ్ర కు అన్యాయం చేస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసిపి విజయం ఖాయమని వాసుపల్లి గణేష్ కుమార్ స్పష్టం చేశారు.