Tv424x7
Andhrapradesh

దీపావళి ఏ రోజున జరుపుకోవాలి..? అక్టోబర్ 31 లేదా నవంబర్ 1..!!

దీపావళి పండుగ( Deepavali Festival ) వచ్చేస్తోంది.. దేశమంతా వెలిగిపోనుంది. ప్రతి ఇల్లు దీపాలంకరణతో కళకళలాడిపోనుంది. ఇక పిల్లలు పటాకులు( Crackers ) కాల్చేందుకు రెడీ అయిపోతున్నారు.అంతేకాదు.. దీపావళి( Deepavali ) నాడు ప్రతి మహిళ ప్రత్యేకంగా లక్ష్మీపూజ( Lakshmi Puja ) నిర్వహించి, తమ ఇంట సిరిసంపదలు కురిపించాలని ప్రార్థించనున్నారు. అయితే ఈ ఏడాది దీపావళి పండుగ( Deepavali Festival )ను ఏ రోజున జరుపుకోవాలనే సందిగ్ధతత నెలకొంది. ప్రతి ఏడాది ఆశ్వయుజ మాసం( Ashwayuja Masam )లో అమావాస్య( Amavasya ) రోజున దీపావళిని జరుపుకుంటారు. అలాగే దీనికి ముందు రోజు వచ్చే ఆశ్వయుజ బహుళ చతుర్ధశిని నరక చతుర్ధశిగా నిర్వహించుకుంటారు.మరి.. ఆ తిథి ఎప్పుడు వచ్చింది? అక్టోబర్ 31నా? లేక నవంబర్ 1వ తేదీనా? అనేదానిపై ప్రజల్లో స్పష్టత లేదు. మరి పంచాంగం ప్రకారం ఏ రోజు జరుపుకోవాలనే విషయంపై జ్యోతిష్య పండితులు స్పష్టత ఇచ్చారు. మనలో చాలా మంది అమావాస్య ఘడియలు ఉన్న సాయంత్రం రోజునే పరిగణనలోకి తీసుకోని.. సాయంత్రం లక్ష్మీపూజ చేసి, దీపాలు వెలిగిస్తుంటారు.అయితే.. ఈ ఏడాది అమావాస్య ఘడియలు అక్టోబర్ 31, నవంబర్ 1 తేదీల్లో విస్తరించి ఉండడంతో చాలా మందిలో గందరగోళం ఏర్పడింది. ఈ ఏడాది అక్టోబర్ 31 తేదీన నరక చతుర్దశి, దీపావళి రెండూ కలిసి ఒకే రోజు వచ్చాయని.. ఉదయం పూట చతుర్దశి తిథి, మధ్యాహ్నం 3.40 నిమిషాల నుంచి అమావాస్య ప్రారంభం అవుతుందని పండితులు చెబుతున్నారు. అక్టోబర్ 31 గురువారం రాత్రి మొత్తం అమావాస్య వ్యాపించి ఉంటుంది. కాబట్టి ఆరోజున దీపావళి జరుపుకోవాలని తెలుపుతున్నారు.అమావాస్య ఘడియలు అక్టోబర్ 31 మధ్యాహ్నం నుంచి నవంబర్ 1(శుక్రవారం) సాయంత్రం 6.15 వరకు ఉన్నా.. ఆ రోజు దీపావళి జరుపుకోకూడదని వివరిస్తున్నారు. ఎందుకంటే దీపావళి సాయంత్రానికి అమవాస్య తిథి ఉండటం ముఖ్యం. ఈ లెక్కన శుక్రవారం రాత్రి పూట అమావాస్య వ్యాపించి లేనందున నవంబర్ 1వ తేదీన దీపావళి జరుపుకోకూడదని చెబుతున్నారు. కాబట్టి.. అక్టోబర్ 31న గురువారం సూర్యోదయానికి చతుర్థశి తిథి ఉండడంతో ఆ రోజునే ఉదయం నరక చతుర్థశి జరుపుకోవాలని.. సాయంత్రానికి అమావాస్య తిథి వస్తుండడంతో అదే రోజు రాత్రి దీపావళి జరుపుకోవాలని సలహా ఇస్తున్నారు.

Related posts

డీజీపీ, ఇంటెలిజెన్స్ ఏడీజీలతో సీఎస్ జవహర్ రెడ్డి అత్యవసర భేటీ

TV4-24X7 News

వ్యూహం’ సినిమా డిసెంబర్ 29న రిలీజ్

TV4-24X7 News

మధ్యాహ్న భోజన పథకం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాలపై మంత్రి నారా లోకేశ్‌ అధికారులతో సమీక్ష

TV4-24X7 News

Leave a Comment