పర్యావరణ రహిత దీపావళి జరుపుకోవాలని పిలుపు
విశాఖపట్నం దేశమంతా జరుపుకునే పండుగలలో దీపావళి ఎంతో ప్రత్యేకమైనదనీ ,చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళిని జరుపు కుంటారరని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. సంప్రదాయ అలంకరణ వంటకాలతో యువతీ ,యువకులు ఆనందోత్సాహాలతో వేడుకలో పాల్గొన్నారు. వళి అంటే వరుస , దీపావళి అంటే దీపాల వరుస . చీకట్లను పారద్రోలే వెలుగు ఉత్సవం అలాంటి ఉత్సవాన్ని కాలుష్య రహితంగా , ప్రకృతికి హాని కలుగకుండా పర్యా వరణ హిత దీపావళి ని ప్రజలందరూ జరుపుకోవాలి అంటూ సదరన్ ఎడ్యుకేషన్ ఇన్సిస్టూషన్స్ వారు పిలుపునిచ్చారు . ఈ సందర్భంగా కళాశాలలో , ఏర్పాటు చేసిన దీపాల అలంకరణలు , సాంప్రదాయాన్ని ప్రతిబింబించే వంటలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. సదరన్ సీఎండీ సతీష్ పొన్నం మాట్లాడుతూ ప్రకృతికి విఘాతం కలిగించని , ధ్వని పర్యావరణ కాలుష్యం లేని దీపావళి ని అందరూ జరుపుకోవాలి అని పిలుపునిచ్చారు . సాంప్రదాయ విలువల్ని కాపాడుతూ ఈ విధంగా దీపావళి పండుగ జరుపుకోవడం స్ఫూర్తి దాయకo అన్నారు. ఈ సందర్భoగా కళాశాల విద్యార్థినీ విద్యార్థులు సాoప్రదాయ వస్త్రధారణ లో ఆహుతులను అలరించారు . కార్యక్రమంలో సదరన్ ఎడ్యుకేషన్ ఇన్సిస్టూషన్స్ విద్యార్థినీ, విద్యార్థులు, సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.