విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నర్సుల అసోసియేషన్ ఎన్నికల్లో విజయం సాధించిన గంగాభవాని ప్యానెల్ నూతన కార్యవర్గం ఈరోజు దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ని మర్యాద పూర్వకంగా కలిశారు .ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ కేజీహెచ్ అభివృద్ధికి మరిన్ని కార్యక్రమాలు త్వరలో చేపడతారని , త్వరలో 3 ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ మద్దిరాల ఇందిర, కార్యదర్శి వరలక్ష్మి, కోశాధికారి బుద్ధరాజు వంశీ, పాలకవర్గ సభ్యులు మెహర్ శాంతి, వియ్యపు వినీల, దాసరి లిల్లీ గౌడ్, గంగాగౌరి, పద్మజ పాల్గొన్నారు.

next post