Tv424x7
ఆరోగ్యం

చంపేస్తున్న స్ట్రీట్ ఫుడ్.

ఈరోజులో ఎక్కడపడితే అక్కడ, ఏదిపడితే అది.. లాగించేస్తున్నాం.. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ఇష్టమైన స్నాక్స్ ను ఆరగించేస్తున్నాం.. అయితే.. స్ట్రీట్ ఫుడ్స్ తినడం వల్ల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. హైదరాబాద్ లో ఓ మహిళ తనకు ఇష్టమైన మోమోస్ తిని ప్రాణం పోగొట్టుకుంది. అంతకు ముందు షవర్మా తిని చాలా మంది అస్వస్థతకు గురయ్యారు. పానీపూరి..బహుశా దీన్ని ఇష్టపడని వారు ఉండరేమో.. సాయంత్రం అయ్యిందంటే చాలు.. కొందరు పానీపూరి బండి వద్ద క్యూ కట్టేస్తుంటారు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అందరూ అమితంగా ఇష్టపడే పానీ పూరి.. స్ట్రీట్ ఫుడ్ లో అత్యంత ప్రమాదకరమైనది వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇందులో డేంజరస్ బ్యాక్టిరియాతో పాటు రసాయనాలు కూడా ఉంటాయని అంటున్నారు. అంతేకాదు పానీపూరిలో ఉపయోగించే వడకట్టని నీరు వల్ల కలరా బారిన పడే ప్రమాదం ఉందని అంటున్నారు. కొన్నిసార్లు మసాలా నీటిలో ఉపయోగించే సింథటిక్ రంగులు కూడా మన ఆరోగ్యంపై పెను ప్రభావం చూపిస్తాయి. పానీపూరి వల్ల గుండె జబ్బులు, ఇమ్యూనిటీ డిజార్డర్స్ వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

Related posts

AC ని ఎలా ఉపయోగించాలి?మన వైద్య నిలయం సలహాలు

TV4-24X7 News

జాగ్రత్త.. ఎండ వల్ల బ్రెయిన్ స్ట్రోక్

TV4-24X7 News

నిత్యం మనం తినే పండ్లు, కూరగాయల ప్రయోజనాలేంటో తెలుసుకోండి

TV4-24X7 News

Leave a Comment