Tv424x7
Andhrapradesh

39 వార్డ్ లో పర్యటించిన దక్షిణ నియోజకవర్గo వంశీకృష్ణ శ్రీనివాస్

విశాఖపట్నం 39 వ వార్డులో దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఉదయం 6 గంటల నుంచి స్థానిక జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడు, అధికారులతో కలసి వార్డ్ లో పర్యటించారు .ఈ సందర్భంగా వార్డులో ప్రజలను స్వయంగా కలిసి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీ శ్రీనివాస్ కి పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా కురుపాం మార్కెట్ ఆధునికరించి, ఖాళీ స్థలంలో కళ్యాణమండపం నిర్మించాలని , టిడ్కో ఇళ్లకు మరమ్మతులు చేసి, విద్యుత్ సౌకర్యం కల్పించాలని అదేవిధంగా అర్హులైన లబ్ధిదారులకు శాశ్వత ప్రాతిపదికన రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాలని, పాత రిజిస్ట్రేషన్ భవనము , స్టేట్ బ్యాంక్ ఆఫీస్ భవనములు, బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ భవనం, ఫైర్ స్టేషన్ భవనములను ఆధునికరించి వాడుకులోకి తీసుకురావాలనీ, చిలకపేట సులభ్ కాంప్లెక్స్ అనుకొని వున్న సామాజిక భవనాన్ని వాడుకలోకి తేవాలని, లక్ష్మీ టాకీస్ దగ్గర ఉన్న పార్క్, రైతు బజార్ ఆధునికరించి ప్రజలకు అందుబాటులోకి తేవాలని, బెల్ట్ కింద, లక్ష్మీ టాకీస్ , సీ హర్స్ లో సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలని, సాలిపేటలో వినాయక గుడి ఆధునికరించాలని, పెర్రి రోడ్లో నమాజ్ ప్రదేశాన్ని విస్తరణ చేసి పొట్టి చేయాలని , పొట్టి శ్రీరాములు బ్యాక్ సైడ్ వున్న ఇళ్లకు మంచినీటి సదుపాయం కల్పించాలని, శ్రీ హర్షా కాలనీలో సమస్యల పరిష్కరించాలని ,డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కరించాలని, యస్ ఎల్ కాలువ విస్తరించి, క్రమం తప్పకుండా పారిశుధ్య పనులు చేసి, గ్రీనరీ పెంచాలని, కాలుష్య సమస్య తీర్చాలని, సామాజి భవనాలు పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ కి ప్రజల తెలియపరిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అధికారులతో వెళ్లి కొన్ని సమస్యలు పరిష్కరించగా, కొన్ని సమస్యలు త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. డ్రైనేజీ, నీటి సమస్య, పారిశుధ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా అధికారులు ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను తెలుసుకొని, వారికి అందుబాటులో ఉండాలని కోరారు. ఈ సందర్భంగా వార్డులో పలువురికి ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ చేతులు మీదుగా సామాజిక పెన్షన్లు అందజేశారు . కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సాదిక్ , కూటమి వార్డ్ అధ్యక్షులు ,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

వాసుపల్లి చొరవతో వృద్ధురాలికి ఆశ్రయం

TV4-24X7 News

38 వార్డ్ లో అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్

TV4-24X7 News

వైసిపీ నేత దండు (ఎంఆర్ఎఫ్) సుబ్బయ్య తల్లి…శ్రీమతి దండు వెంకటసుబ్బమ్మ మృతికి రెడ్యం సంతాపం

TV4-24X7 News

Leave a Comment