ఆస్తి విషయంలో జగన్, షర్మిల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇప్పుడీ వివాదం పై నుంచి షర్మిల తన ఫోకస్‌ను మళ్లించారు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టనున్నారు. విద్యుత్ ఛార్జీలపై ఉద్యమించనున్నారు. అయితే, ఆస్తి వివాదం నుంచి ఒకేసారి షర్మిల యూటర్న్ తీసుకోవడంతో అసలేం జరిగి ఉంటుందని రాజకీయ వర్గాలు ఆలోచనలో పడ్డాయి. షర్మిల తన అన్న జగన్‌తో చేతులు కలిపారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

previous post