విశాఖపట్నం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్అన్నారు.దక్షిణ నియోజకవర్గ జనసేన నాయకులు,32వ వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజుతో కలిసి సోమవారం 32వ వార్డులోని పలు ప్రతాలలో సుడిగాలి పర్యటన చేశారు.అల్లిపురం, నేరేళ్ళ కోనేరు, ఏడు గుళ్ళు,చలువతోట, తారకరమ కాలనీ,భీమ్ నగర్,సౌత్ జైల్ రోడ్, దేవాంగుల వీధులలో ఆయన పర్యటన సాగింది.ఈ సందర్భంగా ప్రతీ గడప గడప కు వెళ్లిప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.వారి నుంచి వినతులు స్వీకరించారు.వారి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలను నెరేవేర్చేందుకు తాను ఎప్పుడూ ముందు ఉంటానని చెప్పారు.వార్డులో ఏడు గుళ్ళ సమస్య తో పాటు సిపిఐ బిల్డింగ్ సమీపం లో ఉన్న స్థలంలో కల్యాణ మండపం,ప్లే గ్రౌండ్ నిర్మాణం అలాగే వార్డులో ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు త్వరలో తాను శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు.దక్షిణ నియోజకవర్గ జనసేన నాయకులు,32వ వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజుమాట్లాడుతూ వార్డు అభివృద్ధికి తాను అహర్నిశలు కృషి చేస్తున్నానని పేర్కొన్నారు.ఈ వార్డును మరింత అభివృద్ధి దిశగా తీసుకు వెళ్లేందుకు ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ చేస్తున్న కృషిని కూడా ఆయన అభినందించారు.ఇక్కడ పెండింగ్ లో ఉన్న సమస్యలను ఇప్పటికే తాను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు.ఆయన దానికి సానుకూలంగా స్పందించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు.ఈ కార్యక్రమంలో జోన్-4 జేసీ మల్లయ్య నాయుడు,ఏ ఎం ఓ హెచ్ కృష్ణంరాజు,ఎస్ ఎస్ కిషోర్ కుమార్,ఏ పి డి కె.పద్మావతి,శానిటరీ ఇన్స్పెక్టర్ ఎం.కాశీరావు, ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ సిబ్బంది,సానిటరీ డిపార్ట్మెంట్ సిబ్బంది, సచివాలయం సిబ్బంది,జనసేన కార్యకర్తలు,వీర మహిళలు,కూటమి నాయకులు పాల్గొన్నారు.

previous post
next post