విశ్వ బ్రాహ్మణ ఫంక్షన్ హాల్ మొదటి అంతస్తు నిర్మాణం కొరకు 48.68 లక్షలు, చిన్నమ్మ వీధి,పప్పుల వీధిలో 18 లక్షల తో సీసీ రోడ్లు అభివృద్ది కొరకు శంకుస్థాపన
విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ వంశీకృష్ణ శ్రీనివాస్ 38 వార్డ్ లో సుమారు 67 లక్షల రూపాయల తో చేపడుతున్న అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలలో భాగంగా నియోజకవర్గంలో ప్రతి వార్డులోను అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలిపారు . కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని అన్నారు. ఓల్డ్ సిటీ ని గ్రీన్ సిటీ గా, గోల్డ్ సిటీ గా చేస్తామని అన్నారు. వార్డులో పర్యటిస్తున్న సమయంలో దృష్టికి వచ్చిన ప్రతి పరిష్కరిస్తానని ప్రజలందరూ హామీ ఇచ్చారు కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ విజయలక్ష్మి నరసింహచారి , కమిషనర్ మల్లయ్య నాయుడు, మాజీ జీ కార్పొరేటర్లు ,టిడిపి, బిజెపి ,జనసేన నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.