విశాఖపట్నం అనకాపల్లి పలుచోట్ల చోరీలు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లుగా జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తెలియజేశారు. వివరాలను ఆయన కార్యాలయంలో బుధవారం విలేకరులకు తెలియజేశారు. పాయకరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో 4 కేసుల్లో 8 గ్రాముల బంగారం, 2.120 కేజీల వెండి, 2 కేజీల ఇత్తడి, 15 జతల బట్టలు, ఒక హోమ్ థియేటర్, 2 టీవీలు, 1,240 కేజీల ఇనప గుళ్ళు స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులు పాయకరావుపేట పోలీసులు అరెస్టు చేసినట్లుగా తెలిపారు. పరవాడ పోలీస్ స్టేషన్ చోరీ కేసులో బంగారు పుస్తెల తాడు 2 తులాలు, ఒక బంగారం చేతివేలి ఉంగరం చిన్నది, ఒక జత వెండి పట్టీలు 10 తులాలు ఒక మొబైల్ ఫోను పరవాడ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. 5 కేసుల్లో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రూ.2,31,024 విలువగల చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ క్రైమ్స్ ఎల్. మోహన్ రావు, పరవాడ సబ్ డివిజన్ డి.ఎస్.పి సత్యనారాయణ, పరవాడ సీఐ మల్లికార్జున రావు, సిసిఎస్ సీఐ అప్పలనాయుడు, పాయకరావుపేట సీఐ అప్పన్న, పాయకరావుపేట ఎస్సై పురుషోత్తం, పరవాడ ఎస్సై కృష్ణారావు ఇతర అధికారులు సిసిఎస్ సిబ్బంది పాల్గొన్నారు.

previous post