Tv424x7
Andhrapradesh

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులుగా వేమిరెడ్డి.ప్రశాంతిరెడ్డి ప్రమాణస్వీకారం

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్‌ గా నియమితులైన కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు ప్రమాణస్వీకారం చేశారు. బుధవారం ఉదయం టిటిడి ఛైర్మన్‌ బి.ఆర్‌ నాయుడు, ఇతర సభ్యులతో కలిసి శ్రీవారి ఆలయంలో ఆమె బోర్డు మెంబర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. సదరు కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గారితో పాటు తనయులు అర్జున్‌రెడ్డి, నీలిమారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య నాయకులు కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి, కోడూరు కమలాకర్‌రెడ్డి తదితరులు వేమిరెడ్డి దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో చైతన్య కృష్ణ, వంశీరెడ్డి, కేతంరెడ్డి వినోద్‌రెడ్డి, సూరా శ్రీనివాసులురెడ్డి, చెంచు కిషోర్‌, జెట్టి రాజగోపాల్‌, మదన్‌రెడ్డి, మల్లారెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వేమిరెడ్డి దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అఖండ దీపం వద్ద టెంకాయలు కొట్టి మొక్కు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యురాలిగా ప్రమాణస్వీకారం చేయడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. తిరుమలలో ఎక్కడా కూడా సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా పనిచేస్తామని స్పష్టం చేశారు. ఈ అవకాశం ఇచ్చిన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Related posts

వెయ్యి మంది బాలయ్యలు, చంద్రబాబులు వచ్చినా.. జూ.ఎన్టీఆర్‌ని ఏమీ చేయలేరు..

TV4-24X7 News

ఏపీ కో ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్స్ చైర్మన్ గా నియమితులైన గండి బాబ్జి కి అభినందనలు తెలిపిన 39 వ వార్డు టీడీపీ నాయకులు

TV4-24X7 News

హంతకులు అధికారంలో ఉంటే ఎప్పటికీ న్యాయం జరగదు: సునీత

TV4-24X7 News

Leave a Comment