Tv424x7
Andhrapradesh

ఏసీబీకి పట్టుబడిన డీఈఓ..రవీందర్

మహబూబ్ నగర్ జిల్లా డీఈవో రవీందర్ ఒక ఉపాధ్యాయుడి నుండి లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీకి పట్టుబడ్డాడు. ఒక ఉపాధ్యాయుడికి దక్కవలసిన సీనియారిటీ దక్కకపోవడంతో తనకు న్యాయం చేయాలని పలుమార్లు డీఈఓకు విజ్ఞప్తి చేశారు. 50,000 రూపాయలు లంచం డిమాండ్ చేయడంతో ఆ ఉపాధ్యాయుడు ఏసీబీ డీఎస్పీ కృష్ణ గౌడ్ ను ఆశ్రయించారు. పథకం ప్రకారం గురువారం ఉదయం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కాలనీలో ఉన్న డీఈవో ఇంటికి వెళ్లి 50 వేల రూపాయలు ఇస్తుండగా డీఎస్పీ కృష్ణ గౌడ్ బృందం డీఈఓను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం 50 వేల రూపాయలు స్వాధీనం చేసుకొని విచారణ చేస్తున్నారు.

Related posts

లిక్కర్ సొమ్ములో జగన్ సన్నిహితుడికి 1000కోట్లు – బెంగళూరులో రియల్ ఎస్టేట్..!

TV4-24X7 News

10 నెలల్లో రూ. 8 లక్షల కోట్ల పెట్టుబడులు: మంత్రి లోకేష్

TV4-24X7 News

విశాఖ రెడ్ క్రాస్ సొసైటీ లో స్వర్గీయ పంపాన రవిశంకర్ దశ కర్మ జ్ఞాపకార్థం అన్న సమారాధన

TV4-24X7 News

Leave a Comment