విశాఖపట్నం వాలంటరీలకు న్యాయం చేయాలని కోరుతూ ఈ నెల 9 న విజయవాడలో నిర్వహించనున్న వాలంటీర్లు ఆవేదన సదస్సు వెళ్లకుండా ఈ రోజు ఉదయం ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు కింగువ అచ్యుత్ రావు న్యూ పోర్ట్ పోలీస్ లు ముందస్తు చర్యల్లో భాగంగా హౌస్ అరెస్ట్ చేసి పెద గంట్యాడ న్యూ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. ఈ సంద ర్బంగా కింగువ అచ్యుత్ రావు మాట్లాడుతూ.కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు వాలంటీర్లకు బకా యిలు చెల్లించాలి, గౌరవ వేతనం 10వేలు రూపాయలు ఇచ్చి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వాలంటీర్లు గోడును కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లాలని విజయవాడలో వాలంటరీ సదస్సు నిర్వహించుకుంటే సదస్సులు కూడా వెళ్లకుండా ముందస్తు చర్యలో భాగంగా పోలీసులు చేత నోటీసులు ఇప్పిస్తున్నారనిన్నారు.
