విశాఖపట్నం పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, శుక్రవారం నాడు 96 వార్డుల్లో గల వెంకటేశ్వర స్వామి టెంపుల్, నల్ల క్వారీ, జెఎన్ఆర్ఎం దగ్గు వానిపాలెం ప్రాంతాలలో 5 కోట్ల 56 లక్షలు రూపాయలు విలువచేసే పలు అభివృద్ధి కార్యక్రమాలకు వరుసగా శంకుస్థాపనలుచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలోనే నెరవేరుస్తుందని తెలిపారు. రానున్న రోజుల్లో ప్రజలతో మరింత మమేకమైప్రజా సమస్యలు త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు.
