Tv424x7
Telangana

కలెక్టర్‌పై దాడి కేసులో 52 మంది అరెస్ట్?

వికారాబాద్ జిల్లా: నవంబర్12వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ నియోజకవర్గంలో ఫార్మా రగడ ఇంకా చల్లారలేదు. సోమవారం దుద్యాల మండలం లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటుకు భూ సేకరణపై.. ప్రజాభిప్రాయ సేకరణకు జిల్లా కలెక్టర్‌తో పాటు కొడంగల్‌ డెవల ప్‌మెంట్‌ అథారిటీ ప్రత్యేక అధికారి సహా పలువురు అధికారులు వెళ్లారు. అయితే.. ప్రజాభిప్రేయ సేకరణను వ్యతిరేకిస్తూ.. కలెక్టర్‌, అధికారులను రైతులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో రైతులు, అధికారుల మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది. అది కాస్త దాడికి దారి తీసింది. కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌, కడ ప్రత్యేక అధికారి వెంకట్‌ రెడ్డిపై దాడి చేశారు రైతులు. అధికారుల వాహనాలను ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం అర్థరాత్రి గ్రామాల్లో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అధికారులపై దాడి చేసిన వారిలో ఇప్పటివరకు 52 మందిని గుర్తించి వారిని అరెస్ట్‌ చేశారు. పరిగి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా లగచర్ల, రోటిబండ, పులిచర్ల సహా 6 గ్రామాల్లో ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు.

Related posts

ఏపీలో కలిపిన ఐదు గ్రామాలు తెలంగాణలకు

TV4-24X7 News

జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసులో ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ అరెస్ట్?

TV4-24X7 News

సీఎం రేవంత్‌రెడ్డికి బండి సంజయ్ బహిరంగ లేఖ…🖊️

TV4-24X7 News

Leave a Comment