మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి దాతృత్వం పై హర్షం
విశాఖపట్నం రోడ్డు ప్రమాదంలో కాలు విరిగి సాగర్ దుర్గా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న లండ నూకరాజుకు మాజీ ఎమ్మెల్యే, దక్షిణ వైసిపి సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ రూ. పది వేలు ఆర్థిక సాయం అందజేశారు. జీవీఎంసీ 38వ వార్డు బుక్కా వీధికి చెందిన లండ ఎర్రమ్మ కుమారుడు లండ నూకరాజు ను ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. వాసుపల్లి గణేష్ కుమార్ తన సొంత నిధులతో మెడికల్ ఖర్చులకు రూ. పది వేలు నగదును ఇచ్చారు. ఆసుపత్రి ఎండి తో మాట్లాడి ఆసుపత్రి బిల్లులో రూ. 30 వేలు తగ్గించే విధంగా ఏర్పాటు చేసారు. పేదల కష్టాలే తన కష్టాలుగా భావించే మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తన సేవలు కొనసాగించడం పట్ల బాధితులు వర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ దక్షిణ ప్రజలతో తనది విడదీయరాని బంధమని, చిన్నప్పటినుండి పెరిగిన ఈ ప్రాంతం ప్రజలతో తన జీవిత తెలియకుండానే ముడిపడే పోయిందన్నారు. ఈ ప్రాంత ప్రజల కష్టాల్లో తాను కూడా అండగా ఉండే విధంగా సాయం అందిస్తున్నట్లు వాసుపల్లి గణేష్ కుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మైనార్టీ విభాగం అధ్యక్షుడు ముజీబ్ ఖాన్, గనగళ్ల రామరాజు, వాసు, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.