పులివెందుల: మాజీ మంత్రి వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి ఇంటికి పోలీసులు వెళ్లారు. సోమవారం ఉదయం పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ సమక్షంలో ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేశారు..కృష్ణారెడ్డి 2022లో వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డితో పాటు సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌పై పులివెందుల కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేశారు. ఆయన ఫిర్యాదుతో అప్పటి పోలీసులు ఆ ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో కృష్ణారెడ్డి వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. న్యాయవాదుల సమక్షంలో ఆయన్ను విచారించారు..
