Tv424x7
Telangana

అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం.. సంగారెడ్డిలో కూల్చివేతలు

HYDRA: సంగారెడ్డి: ఆక్రమణలు చేసిన అక్రమార్కుల పాలిట ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా(HYDRA) ఇవాళ (సోమవారం) మరిన్ని కూల్చివేతలు చేపట్టింది. అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు..వందనపురి కాలనీలో 848 సర్వే నంబర్‌లో అక్రమ నిర్మాణంపై కొరడా ఝుళిపించారు.కొంతమంది రోడ్డును ఆక్రమించి ఇంటి నిర్మాణం చేపట్టారు. భారీ యంత్రాలతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు వాటిని కూల్చివేస్తున్నారు. అమీన్ పూర్‌లోని వందనపురి కాలనీలో అక్రమ భవనాన్ని హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు.తెలంగాణలో అక్రమ నిర్మాణాల కూల్చివేతల కోసం కాంగ్రెస్ సర్కార్ (Congress Govt) తీసుకున్న సంచలన నిర్ణయమే హైడ్రా (HYDRA). దీనిని ఏర్పాటు చేసి మూడున్నర నెలలు దాటింది. ఎఫ్టీఎల్‌, బఫర్ జోన్ పరిధిలో ఉన్న చాలా అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చి వేసింది. రాష్ట్ర చరిత్రలోనే మూడున్నర నెలల వ్యవధిలో 300కు పైగా అక్రమ నిర్మాణాల హైడ్రా నేలమట్టం చేసింది. ప్రభుత్వ ఆస్తులు, చెరువుల పరిరక్షణ కోసం జూలై 19వ తేదీన హైడ్రాను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో 99ను తీసుకువచ్చింది. దీంతో జూలై 26వ తేదీ నుంచి కూల్చివేతలను మొదలుపెట్టింది హైడ్రా. ఇప్పటి వరకు 30కు పైాగా ప్రాంతాల్లో 300కు మించి ఆక్రమణలను కూల్చివేసింది. 100 రోజుల్లో 120 ఎకరాలను ప్రభుత్వానికి అప్పగింది. జీహెచ్‌ఎంసీతో పాటు 27 మున్సిపాలిటీలు, 33 గ్రామాల్లో హైడ్రా దూకుడు మామూలుగా లేదు. హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో దేశవ్యాప్తంగా హైడ్రా పేరు మార్మోగింది..

Related posts

గంజాయిపై సమాచారం ఇస్తే రూ. 2 లక్షలు నగదు

TV4-24X7 News

జాగృతి లీడర్లను తయారు చేసుకుంటున్న కవిత !

TV4-24X7 News

సీనియర్ ఎన్టీఆర్‌కు నివాళులర్పించిన జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్

TV4-24X7 News

Leave a Comment