AP NEWS: అమరావతి: విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో ముడుపులు అందుకున్న వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏసీబీ, లేదా సీబీఐ విచారణ జరపాలని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు..ఇవాళ(ఆదివారం) మీడియాతో యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ… ఇది మరో పెద్ద క్విడ్ ప్రో కో డీల్ అని విమర్శించారు. అమెరికా దర్యాప్తు సంస్థ లంచం డబ్బు జగన్‌కు చేరిందని తేల్చేసిందని అన్నారు. ఈ కేసులో అమెరికాలోని అక్కడి దర్యాప్తు సంస్థలు ఏమి చేస్తాయన్నది ఆ దేశంలో కోర్ట్‌లు తెలుస్తాయని తెలిపారు..కానీ లంచాలు తీసుకున్నది జగన్, ఆ డబ్బులు చేరింది ఏపీకి, నష్టపోయేది రాష్ట్ర ప్రజలని తెలిపారు. అదంతా ప్రజల సొమ్ము అని.. విచారణ జరిపించాలని కోరారు. లంచం డబ్బు తీసుకుని ప్రజలపై భారం మోపేందుకు జగన్ సిద్ధమయ్యారని మండిపడ్డారు. పక్కా ఆధారాలు లభించడంతో రాష్ట్ర ప్రభుత్వం మీన మేషాలు లెక్కించకుండా వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. సీబీఐ దర్యాప్తునకు సిఫార్సు చేయడమా? లేక ఏసీబీ విచారణకు అదేశించడమా అనేది వెంటనే చేయాలని యనమల రామకృష్ణుడు కోరారు.బట్టబయలైన ‘ముడుపుల బంధం’..కాగా..వివాదాస్పద వ్యాపారవేత్త.. గౌతమ్ అదానీ.. దేశంలోనే అత్యంత అవినీతిపరుడైన రాజకీయ వేత్తగా ముద్రపడిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. వీరిద్దరి మధ్య ‘ముడుపుల బంధం’ బట్టబయలైంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల కోసం అదానీ సంస్థ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.2,029 కోట్ల లంచాలను ఎరవేసింది. ఇందులో ఏకంగా రూ.1,750 కోట్లు ‘జగన్ యంత్రాంగానికే’ అందించింది. ఇది తెలుగుదేశం పార్టీ చేసిన ఆరోపణ కాదు! మన దేశానికి చెందిన సీబీఐ, ఈడీలు తేల్చిన సంగతీ కాదు. అమెరికా స్టాక్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్‌ఈసీ), ఆ దేశ దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ, న్యాయ శాఖ నిగ్గు తేల్చిన విషయాలు! దీనిపై ఈస్ట్ డిస్ట్రిక్ట్ న్యూయార్క్ కోర్టులో అభియోగాలు కూడా నమోదయ్యాయి. అదానీపై అమెరికాలో అరెస్టు వారెంటు జారీ అయ్యింది.భారతదేశంలో రెండో అతిపెద్ద సంపన్నుడైన గౌతమ్ అదానీ భారీ సంక్షోభంలో ఇరుక్కున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థను అడ్డం పెట్టుకొని, రాష్ట్రాల్లోని విద్యుత్ సంస్థలకు సౌరశక్తిని అమ్మే కాంట్రాక్టులు దక్కించుకోవడం కోసం 2021-24 మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సహా ఐదు రాష్ట్ర ప్రభుత్వాల్లోని కీలక వ్యక్తులకు రూ.2,029 కోట్లు లంచంగా చెల్లించారని అమెరికా కేంద్ర దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ సంచలన ప్రకటన చేసింది. అందులో రూ.1,750 కోట్లు అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని కీలకమైన వ్యక్తికి చెల్లించారని ప్రకటించింది.అసలేం జరిగిందంటే..భారత సౌర విద్యుత్తు సంస్థ (సెకీ) రాష్ట్రాలకు సోలార్ పవర్ సరఫరా చేసేందుకు ఆహ్వానించిన టెండర్‌ను అప్పట్లో అదానీ గ్రూప్ దక్కించింది. దీని ప్రకారం… రాష్ట్రాల డిస్కమ్‌లు ‘సెకీ’తో ఒప్పందం చేసుకుంటే… అదానీ ప్లాంట్ల ద్వారా సౌర విద్యుత్తును సరఫరా చేస్తారు. అయితే… అదానీ కోట్ చేసిన ధరను చూసి డిస్కమ్‌లు బెంబేలెత్తాయి. ఒక్క ప్రభుత్వం కూడా సెకీతో ఒప్పందానికి ముందుకు రాలేదు. అవి కుదిరితే తప్ప ప్లాంట్లు ఏర్పాటు చేయలేరు. సొమ్ములు సంపాదించలేరు. ప్లాంట్ల ఏర్పాటు పేరుతో అప్పటికే భారీగా అప్పులు తెచ్చి, పెట్టుబడులు సమీకరించిన నేపథ్యంలో ‘అదానీ’పై ఒత్తిడి బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో అదానీ గ్రూప్ ‘లంచాల యాత్ర’ మొదలుపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వాల్లోని కీలక వ్యక్తులను కలిసి లంచాలు ఆఫర్ చేసినట్లు అమెరికా దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయి. ఇందులో… జగన్ జమానాలో జరిగిన సంఘటనల గురించి మరింత వివరంగా వెల్లడించాయి. ”ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ను అదానీ పలుమార్లు స్వయంగా కలిశారు. 2021లో ఆగస్టు 7న జగన్‌తో అదానీ భేటీ అయ్యారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదరకపోవడంపై చర్చించారు. లంచాలు ఆఫర్ చేశారు..

previous post