Tv424x7
Andhrapradesh

గుంటూరు జైలుకు కొమ్మినేని..!

అమరావతి మహిళలపై అసభ్య వ్యాఖ్యల కేసులో మంగళ గిరి కోర్టు కొమ్మినేని శ్రీనివాస రావుకు కోర్డు 14 రోజులు రిమాండ్‌ విధించింది.ఈనెల 24 వరకు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధిస్తున్నట్లు మంగళగిరి కోర్టు పేర్కొంది. కొమ్మినేని శ్రీనివాసరావును గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. కాగా అమరావతి మహిళల పై అసభ్య వ్యాఖ్యల కేసు లో కొమ్మినేని సోమవారం అరెస్టు అయ్యారు. ఇదే కేసులో మరో నిందితు డు కృష్ణంరాజు అజ్ఞాతం లోకి వెళ్లిపోయారు. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు.కొమ్మినేనిని సోమవారం హైదరాబాద్‌లో తుళ్లూరు పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి నుంచి విజయవాడ మీదుగా గుంటూరులోని నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు పోలీసులు తరలించారు. నేడు తొలుత గుంటూరు జీజీహెచ్‌లో వైద్య పరీక్షల అనంతరం పోలీసులు కొమ్మినేనిని కోర్టుకు తీసుకు వచ్చారు. ప్రభుత్వం, నిందితుడి తరఫు న్యాయ వాదుల వాదనలు విన్న అనంతరం కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్‌ విధిస్తూ న్యాయస్థానం తీర్పుని చ్చింది. ఈ నెల 24 వరకు ఆయన కు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. సాక్షి ఛానల్‌లో నిర్వహించే ఓ చర్చా కార్యక్రమం సందర్భం గా జర్నలిస్టు కృష్ణంరాజు అమరావతి ప్రాంతాన్ని, అక్కడి మహిళలను ఉద్దే శించి అత్యంత జుగుప్సా కర రీతిలో వ్యాఖ్యలు చేశారు. అమరావతి దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని అంటూ జర్నలిస్టు కృష్ణంరాజు శ్రుతిమించి మాట్లాడారు.

Related posts

ఈసీ కీలక నిర్ణయం

TV4-24X7 News

వాసుపల్లి చొరవతో వృద్ధురాలికి ఆశ్రయం

TV4-24X7 News

తెలుగుదేశంపార్టీ రాష్ట్ర కార్యనిర్వహణా కార్యదర్శి సియం సురేష్ నాయుడు ఆధ్వర్యంలో సమావేశం

TV4-24X7 News

Leave a Comment