విశాఖపట్నం విశాలాంధ్ర ప్రచరణ పుస్తకాల పఠనంతోనే విజ్ఞానం కలుగుతుందని ఆంధ్ర యూనివర్సిటీ పూర్వపు వైస్ ఛాన్స్ లర్ , ప్రస్తుత సెంచూరియన్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ డాక్టర్ జి ఎస్ ఎన్ రాజు అన్నారు. ఆదివారం ఉదయం విశాఖ టర్నర్ సత్రం విశాలాంధ్ర పుస్తక మహోత్సవం ప్రాంగణంలో పుస్తక ప్రదర్శనను విశాలాంధ్ర విజ్ఞాన సమితి చైర్మన్ ముప్పాళ్ళ నాగేశ్వరరావు తో కలిసి సందర్శించారు. ముందుగా ఈ పుస్తక ప్రదర్శనకు విచ్చేసిన ఆచార్య జిఎస్ఎన్ రాజుకు విశాలాంధ్ర విజ్ఞాన సమితి చైర్మన్ ముప్పాళ్ళ నాగేశ్వరరావు పుష్పగుచ్చిo తో స్వాగతం పలికారు. అనంతరం పుస్తక ప్రదర్శన సముదాయాన్ని సందర్శించారు. అనేక పుస్తకాలపై విశ్లేషణ చేశారు.ఈ సందర్భంగా ఆచార్య జిఎస్ఎన్ రాజు మాట్లాడుతూ మంచి పుస్తకాలు దొరికే చోటు విశాలాంధ్ర అని ఎవరు అడిగినా చెబుతారు అన్నారు. నేటికీ విజ్ఞానం అందుబాటులో ఉందంటే విశాలాంధ్ర విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో అనేక రకాల పుస్తకాలు ఒకే చోట పెట్టి , తెలుగు రాష్ట్రాల్లో విజ్ఞానాన్ని అందిస్తున్న ఏకైక సంస్థ విశాలాంధ్ర అని , సామాజిక, సాహిత్య రంగాలపై అంకితభావంతో విశాలాంధ్ర నేటికీ అనేక ప్రాంతాల్లో పుస్తక ప్రదర్శనలు పెట్టి, పుస్తక ప్రియులకు చేరువై ఎనలేని కృషి చేస్తుందని డాక్టర్ జిఎస్ఎన్ రాజు కొనియాడారు. అన్ని రకాల పుస్తకాలను ఒక చోట చేర్చి, డిజిటల్ రంగం దూసుకుపోతున్నప్పటికీ , పుస్తకాలకు ఆదరణ తగ్గలేదని చాటి చెప్పాలా విశాలాంధ్ర చేస్తున్న అభినందనీయమని విశాలాంధ్ర విజ్ఞాన సమితి చైర్మన్ ముప్పాళ్ళ నాగేశ్వరరావు ని రాజు అభినందించారు. ఈ సందర్భంగా విశాలాంధ్ర విజ్ఞాన సమితి చైర్మన్ ముప్పాళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూ సాహిత్యం తోపాటు అన్ని రకాల పుస్తకాలను ఒకే చోట పెట్టి, ఎగ్జిబిషన్ ద్వారా ప్రజలకు మరింత చేరువు కావాలని విశాలాంధ్ర ఈ ప్రదర్శన నిర్వహిస్తుందన్నారు. విశాలాంధ్ర పుస్తక ప్రదర్శన కు రాష్ట్రంలో ఆదరణ తగ్గలేదు అన్నారు. ఈ కార్యక్రమంలో డిహెచ్ పి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు జెవి ప్రభాకర్, అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పల అప్పలరాజు, అరసం కార్యదర్శి సి ఎస్ క్షేత్ర పాల్, సభ్యులు బొట్టా అప్పారావు , విశాలాంధ్ర దినపత్రిక విశాఖ ఎడిషన్ మేనేజర్ సనపల నరసింహులు, విశాలాంధ్ర బుక్ హౌస్ మేనేజర్ పిఏ రాజు తదితరులు పాల్గొన్నారు.

previous post