Tv424x7
Andhrapradesh

శ్రీశ్రీశ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మహోత్సవముల పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్

మొదటి లక్ష్మివారం పంచామృత అభిషేకం టికెట్ (రు/- 7,500) కొనుగోలు చేసిన ఎమ్మెల్యే

విశాఖపట్నం డిసెంబర్ 2 తేదీ నుంచి 30వ తేదీ వరకు జరిగే శ్రీ శ్రీ కనకమహాలక్ష్మి మార్గశిర మాసోత్సవముల పోస్టర్ ను సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆవిష్కరించారు. మొదటి గురువారం 5 వ తేదిన , రెండవ గురువారం 12 వ తేదీన, మూడో గురువారం 19వ తేదీన, 4 గురువారం 26వ తేదీన ఉత్సవ పర్వదినములు జరుగుతాయని తెలిపారు. అదే విధంగా 22వ తేదీ వేదసభ మరియు అర్చక సదస్సు, 28వ తేదీన రదయాత్ర , 26వ తేదీన సహస్ర ఘటాభిషేకం, మహా అన్నదాన ప్రసాదం జరుగుతాయని ఈఓ శోభారాణి తెలిపారు. అనంతరం మార్గశిర మాసం మొదటి లక్ష్మీవారం సాయంకాలం 6.00 గం. ల నుండి 7.00 గం.ల వరకు జరుగు ప్రత్యేక పంచామృత అభిషేకం లో విశాఖపట్నం సౌత్ నియోజక వర్గ శాసన సభ్యుల కుటుంబం సమేతం గా పాల్గొనుటకు రు.7500/- ల టిక్కెట్టును కొనుగోలు చేయుట జరిగినది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా అమ్మవారి ఉత్సవాలు జరుగుతాయని అన్నారు. కార్యక్రమంలో ఆలయ ఎఈవో తిరుమలేశ్వర రావు, ఈ ఈ రమణ పాల్గొన్నారు.

Related posts

ఐటీలో 5 లక్షల ఉద్యోగాలే మా లక్ష్యం: లోకేశ్‌

TV4-24X7 News

సామాజిక సేవలో ఎస్ జీ ఎస్

TV4-24X7 News

మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ కు జైలు శిక్ష..!

TV4-24X7 News

Leave a Comment