డయేరియా ప్రబిలిన ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటన
మెడికల్ క్యాంపు, పారిశుధ్యం , వాటర్ ట్యాంకులు సరఫరా పై ఆరా
ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు
విశాఖపట్నం 37 వార్డ్, జబ్బర్ తోట లో డయేరియా ప్రబలి పలువురు హాస్పిటల్ లో చేరిన నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ వార్డులో పర్యటించారు. డయేరియా ప్రబలడం పై గల కారణాలను స్థానిక ప్రజలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. శానిటేషన్, మెడికల్ క్యాంపులు, వాటర్ ట్యాంకు లను ఏర్పాటు చేయించి, సమస్య పునరావృతం కాకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. ఎప్పటికప్పుడు వార్డ్ లో ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకోవాలని అధికారులకు తెలిపారు. బ్లీచింగ్, శానిటేషన్ క్రమం తప్పకుండా జరగాలని తెలిపారు. కేజీహెచ్ సూపర్డెంట్ గారితో మాట్లాడి , ప్రత్యెక శ్రద్ద చూపాలని తెలిపారు. కూటమి నాయకులను ప్రజలకు అందుబాటులో వుండాలని , సమస్య వున్న తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. కార్యక్రమంలో అహో రాజు, వైద్యాధికారులు, శానిటేషన్ సిబ్బంది, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.