విశాఖపట్నం సహృదయసాహితి ఆధ్వర్యంలో టర్నర్ చౌల్ట్రీ దగ్గర విశాలాంధ్ర పుస్తక ప్రదర్శన ప్రాంగణంలో జరిగిన కవిసమ్మేళనం అందరినీ వైవిధ్యభరితమైన కవితలతో అలరించింది అధ్యక్షోపన్యాసంలో శేఖరమంత్రి ప్రభాకర్మాట్లాడుతూ కవిత్వంలో వస్తువు, అభివ్యక్తి రెండూ ప్రధానమే. దానికి తోడు అలంకారం కావ్యసౌందర్యానికి శోభను కలుగజేస్తుంది, కావ్య శరీరానికి హౕరాలనలంకరిస్తుంది. కవులు కవిత్వంలో భాష, భావంతో పాటు అలంకారం కూడా ముఖ్యమైన అన్నారుముఖ్య అతిధిగా విచ్చేసిన డాక్టర్ డి వి సూర్యారావు మాట్లాడుతూ కవులు సామాజిక కార్యకర్తలుగా సమాజ సౌభాగ్యానికి, తమ కవిత్వంతో మార్పు తీసుకుని రావాలి, కవిత్వం భావస్పోరకంగా ఉండాలి అన్నారువిశిష్ట అతిధిగా విచ్చేసిన అరసం కార్యదర్శి ఉప్పల ఆప్పలరాజు పాల్గొన్న కవిసమ్మేళనం కార్యదర్శి సి హెచ్ చిన సూర్యనారాయణ నిర్వహించారువిజయనిర్మాణ్ సంస్థల అధినేత సూరపనేని విజయకుమార్ కవిసమ్మేళనం విశాలాంధ్ర పుస్తక ప్రదర్శన నిర్వాహకుడు రాజు, తదితరులు సహకరించిన ఈ కవిసమ్మేళనం లో భాగవతుల సత్యనారాయణ మూర్తి, డాక్టర్ జి కె సుబ్రహ్మణ్యం,కె వి యస్ మూర్తి, కుప్పిలి భీమేశ్వర రావు, రాధారాణి, కె యస్ వి రమణమ్మ, కొత్తూరు రమణ, , తనికెళ్ళ సూర్యకళ,సూర్యకుమారి, , రామతాత, వడవి అనంతరాం, పి వి ఆర్ కుమారరావు, డాక్టర్ బంజి సత్యనారాయణ,, మావుళ్లయ్య, డి యస్ కుమార్, డి శ్రీనివాస రావు మున్నగువారు పాల్గొని కవితలు చదివి అందర్నీ అలరించారు.
